‘వైస్సార్ తెలంగాణ పార్టీ ని బలోపేతం చేస్తాం’

by Shyam |
ysrtp 01
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లఛ్చాపేట వార్డ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దుబ్బాక మండల అధ్యక్షుడు ఇమ్రాన్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గజ్వేల్ ఇంచార్జీ మెదిని రామాలింగారెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలనను వ్యతిరేకించడానికే షర్మిల వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టిందన్నారు.

ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్, ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యోగాల రాక చనిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ఆర్‌టీపీ ఆధ్వర్యంలో షర్మిల పాదయాత్ర చేపడుతుందని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు స్వామినాథ్, శ్రీనివాస్, దొడ్ల పర్శారాం, ధర్మాజీపేట గట్టు దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed