నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలు: రైతు సంఘాలు

by  |
నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలు: రైతు సంఘాలు
X

దిశ,వెబ్‌డెస్క్: నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు వస్తామని రైతు సంఘాలు తెల్చి చెప్పాయి. రైతు సంఘాల ప్రతినిధుల సమావేశం బుధవారం ముగిసింది. అనంతరం కేంద్ర తాజా ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతు సంఘాలను కేంద్రం అప్రతిష్ట పాలు చేయాలని చూస్తోందని ఆరోపించాయి. రైతుల ఐక్య వేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించాయి. లిఖిత పూర్వక హామీలతో రావాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పాయి.

కొత్తగా తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఉద్యమంతో సంబంధం లేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని అన్నాయి. తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే కేంద్రం ఈ కుట్రలు చేస్తోందని వివరించాయి. రైతులు చర్చలకు సిద్దంగా లేరని చేసే ప్రచారం అవాస్తవమని వెల్లడించాయి. కనీస మద్దతు ధరపై స్వామి నాథన్ సిఫార్సుల మేరకు చట్టం తేవాలని కోరాయి.

Next Story

Most Viewed