‘పోడు భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం’

by  |
‘పోడు భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం’
X

దిశ,మణుగూరు: గిరిజన రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని, పోడు భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు అన్నారు. మంగళవారం అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు,వెంకటాపురం,మామిళ్ల వాయి గ్రామాలను పర్యటించి పోడు భూముల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎంపీ బాబురావుకు వివరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… 40 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అండతోనే ఫారెస్ట్ అధికారులు రైతులపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.ఫారెస్ట్ అధికారుల దాడులతో రైతులు అధైర్య పడవద్దని,రైతులకు అండగా ఉంటామని తెలిపారు.అశ్వాపురం మండలంలో పర్యటించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మండల బీజేపీ నాయకులు శాలువ పుష్పగుచ్చాలుతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు తాటిపాముల ఐలయ్య,ప్రధాన కార్యదర్శి సున్నం సారయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కోల్లు లింగారెడ్డి,నాయకులు గోసుల రాములు,సురకంటి లింగారెడ్డి రెడ్డి, పసునూరి సురేష్,కొండ్రు జంపన్న, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed