రైనా ఉంటే చెన్నై తప్పక ముందుకెళ్తుంది : సెహ్వాగ్

by  |
రైనా ఉంటే చెన్నై తప్పక ముందుకెళ్తుంది : సెహ్వాగ్
X

దిశ, స్పోర్ట్స్: సురేష్ రైనాపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌లో అందరూ మిస్ అవుతున్నది సురేష్ రైనానే. చెన్నై జట్టుకంటే ఎక్కవగా రైనా ఫ్యాన్స్ అతడి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీఎస్కే జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు వదిలేసుకున్నది.

జట్టు సమతూకంలో లేకపోవడంతోనే ఓటములు కొని తెచ్చుకున్నది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవడం ఇదే తొలిసారి కాబోతున్నది. ఈ సమయంలో రైనా ఉండుంటే చెన్నై తప్పక ముందుకు వెళ్లేదని అందరూ అంటున్నారు.’అని సెహ్వాగ్ చెబుతున్నాడు. సెహ్వాగ్‌కు రైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా.. దానికి రిప్లైగా ‘శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు సురేశ్. ఈ ఐపీఎల్‌లో నిన్నెంతో మిస్సయ్యాం. నువ్వు త్వరగా తిరిగొస్తావని ఆశిస్తున్నా. బెస్ట్ విషెష్’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Next Story

Most Viewed