ఆ చెరువుకు గండి.. భయాందోళనలో గ్రామస్తులు

61

దిశ, కామారెడ్డి: లింగంపేట మండలం పోల్కంపేట్ గ్రామంలోని చౌదరి చెరువు ఆనకట్టకు మంగళవారం రాత్రి గండిపడింది. దీంతో చెరువు నుంచి నీరు వృథాగా పోతున్నాయి. ఈ ప్రభావంతో చెరువు కింది భాగంలో ఉన్న పొలాల్లోకి నీరు వెళ్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమై చెరువు నీటిని కాలువల్లోకి మళ్లించినా ఆ నీరు పొలాల్లోకి రావడం గమనార్హం. పొలాలు పూర్తిగా నిండిపోతే చెరువు నీరు గ్రామంలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద ద్వారానే చెరువుకు గండి పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రమాదం నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..