అన్నారం దర్గాలో వక్ఫ్ బోర్డు అధికారి దోపిడీ.. పట్టించుకోరా అంటోన్న భక్తులు

by  |
అన్నారం దర్గాలో వక్ఫ్ బోర్డు అధికారి దోపిడీ.. పట్టించుకోరా అంటోన్న భక్తులు
X

దిశ‌, వ‌ర్ధన్నపేట: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో అదనపు వసూళ్ళు.. అనే కథనాన్ని ఈ నెల 23వ తేదీన ‘దిశ’ దిన పత్రికలో ప్రచురించినప్పటికీ అక్కడ మాత్రం దోపిడీ ఆగడం లేదు. ఈ దోపిడీ కారణంగా వక్ఫ్ బోర్డు అధికారిపై భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్గా ఆవరణలో చెత్తా చెదారం పెరుకుపోవడం, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో కంపుకొడుతోంది. ఇది ఏంటని ఓ వక్ఫ్ బోర్డు అధికారిని స్థానిక ప్రజలు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని వాపోయారు. చివరకు పత్రికలో సమస్యల గురించి ప్రచురించినా స్పందించకపోవడంతో.. వక్ఫ్ బోర్డు అధికారి, దర్గా నిర్వహకులతో కుమ్మక్కై నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. రూ. 20 పెట్టి కోనుగోలు చేసిన కొబ్బరి కాయను దర్గా ఆవరణలో కొట్టడానికి 5 రూపాయల రశీదు పోనూ.. అదనంగా రూ. 10 డిమాండ్ చేయడం అన్నారంలో నిలువెత్తు దోపిడీకి నిదర్శనమని చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని భక్తులు వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed