- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టిప్పు ఇవ్వలేదని చితకబాదిన వెయిటర్.. రెస్టారెంట్‌లో దౌర్జన్యం

X
దిశ, వెబ్‌డెస్క్: టిప్పు ఇవ్వలేదని కస్టమర్లపై వెయిటర్ దాడి చేసిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. బిర్యానీ తినేందుకు స్థానిక యువకులు ఎయిర్ పోర్ట్ బావర్చి హోటల్ కు వెళ్లారు. బిర్యానీ తిన్న అనంతరం బిల్లు కట్టి వెళుతుండగా.. టిప్పు ఇవ్వాలని వెయిటర్ డిమాండ్ చేశాడు. అయితే యువకులు టిప్పు ఇవ్వకపోవడంతో వెయిటర్ దాడికి పాల్పడ్డాడు.
యువకులు, వెయిటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెయిటర్ పై కేసు నమోదు చేశారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం కూడా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ హోటల్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో హోటల్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story