వరల్డ్ మోస్ట్ ఫేవరెట్ క్రికెటర్‌గా కోహ్లీ, మందాన

by  |
వరల్డ్ మోస్ట్ ఫేవరెట్ క్రికెటర్‌గా కోహ్లీ, మందాన
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ క్రికెటర్ల (Indian cricketers)కు ఎంతటి ఆదరణ ఉందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మసాచుసెట్స్ కేంద్రంగా పనిచేసే ‘ఎస్ఈఎం రష్’ (Sem rush) అనే ఆన్‌లైన్ అనలైటిక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli) మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ సంస్థ ఆన్‌లైన్ డేటాను అధ్యయనం చేసి ఈ వివరాలు అందించింది.

ఈ కాలంలో నెటిజన్లు కోహ్లీని నెలకు సగటున 16.2లక్షల సార్లు వెతికారని తేల్చింది. మరోవైపు క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత పాపులర్ జట్టు టీం ఇండియా అని సంస్థ అధ్యయనంలో తేలింది. సగటున నెలకు 2.4లక్షల సార్లు టీం ఇండియా విశేషాల కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. నెటిజన్లు వెతికిన టాప్ టెన్ క్రికెటర్లలో కోహ్లీ తర్వాత, రోహిత్ శర్మ (Rohith sharma) (9.7లక్షలు) , ఎంఎస్ ధోనీ (Ms dhoni) (9.4 లక్షలు), జాన్ మేకే (Jhon meke) (9.1 లక్షలు), జోష్ రిచర్డ్స్ (7.1), హార్ధిక్ పాండ్యా (Hardik pandya) (6.7), సచిన్ టెండుల్కర్ (Scahin tedndulker) (5.4 లక్షలు), క్రిస్ మాథ్యూ (cris mathyue) (4.1), శ్రేయస్ అయ్యర్ (Shreyas ayyar) (3.1 లక్షలు)లు ఉన్నారు.

ఇక పాపులర్ టీమ్స్ విషయంలో టీం ఇండియా టాప్‌లో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజrలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లు ఉన్నట్లు సదరు అధ్యయనంలో తేలింది. ఇక మహిళా క్రికెటర్లలో స్మృతి మందనా (Smurthi mandana), ఎల్లీస్ పెర్రీ కోసం నెటిజెన్లు ఎక్కువ సార్లు సెర్చ్ చేశారు.

Next Story

Most Viewed