భావోద్వేగాల మధ్య కోహ్లీ కెప్టెన్సీకి వీడ్కోలు

by  |
భావోద్వేగాల మధ్య కోహ్లీ కెప్టెన్సీకి వీడ్కోలు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాయకుడిగా విరాట్ కోహ్లీ సోమవారం చివరి మ్యాచ్ ఆడేశాడు. రెండో దశ ప్రారంభానికి ముందే చెప్పినట్లు.. అతడు ఇకపై జట్టులో సాధారణ క్రికెటర్‌గానే ఉంటాడు తప్ప కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఒక భావోద్వేగమైన పోస్టు పెట్టాడు. ‘మేము కోరుకున్న ఫలితం ఇది కాదు. కాని జట్టులోని కుర్రాళ్లు అందరూ చూపించిన వ్యక్తిత్వాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కచ్చితంగా ఒక నిరాశాజనకమైన ముగింపు. కానీ మన తలలు పైకెత్తుకునే ఉందాము. మాకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్, మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు’ అని పోస్టులో పేర్కొన్నాడు.

మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లోనే ఉన్న జట్టంతా కలసి ఉండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కన్నీటిని ఆపుకోలేక పోయాడు. పక్కనే ఉన్న ఏబీ డివిలియర్స్ కూడా చాలా కుంగిపోయి కనిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కోహ్లీకి అందరూ మద్దతుగా మాట్లాడారు. కోహ్లీ కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. అక్కడ వాతావరణం అంతా భావోద్వేగంగా మారిన సమయంలో ఏబీడీ ‘సరే.. నువ్వు కెప్టెన్‌గా దిగిపోయాక కనీసం అంపైర్లు అయినా హాయిగా నిద్రపోతారు’ అని కామెంట్ చేయడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిసాయి.



Next Story

Most Viewed