ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ విరాట్ కోహ్లీ?

by  |
ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ విరాట్ కోహ్లీ?
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంపికయినట్లు సమాచారం. ఈ నెల 28న దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని క్రికెట్ అత్యున్నత నిర్ణాయక మండలి ఐసీసీ ప్రకటించనుంది. గత నెలలో ఐసీసీ డికేడ్ అవార్డుల నామినేషన్లను ప్రకటించారు. పలు కేటగిరీలకు సంబంధించి ఐసీసీ మెన్స్, ఉమెన్స్ క్రికెటర్ల అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ మంది అభిమానులు 5 మిలియన్ల ఓట్లను వేశారు. అభిమానుల ఓట్లతో పాటు జ్యూరీ ఓట్లను కూడా జతచేసి విజేతలను ప్రకటించనున్నారు. కాగా, విరాట్ కోహ్లీ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఫర్ మేల్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నట్లు సమాచారం. అయితే కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, జులన్ గోస్వామి, మిథాలి రాజ్‌కూడా పలు కేటగిరీల్లో నామినేట్ అయ్యారు.

Next Story

Most Viewed