పాలమూరు ఎంపీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్

by  |
పాలమూరు ఎంపీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయడు తెలుగు రాష్ర్టాల పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్, నల్లగొండ తదితర పార్లమెంటు సభ్యులకు ఫోన్ చేసి జిల్లాల్లో కరోనా వివరాలు అడిగి తెలుసుకుని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డికి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎంపీ, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎంపీకి సూచించారు. తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఎంపీని అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలో ఉందని ఎంపీ వెంకయ్యనాయుడుకు తెలిపారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు విస్తృతంగా చేపడుతున్నట్టు ఎంపీ వివరించారు. తమ కుటుంబం తరపున తాము కూడా సాధ్యమైనంతవరకూ సేవా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మహమ్మారి నుంచి తెలుగు రాష్ట్రాలు సాధ్యమైనంత త్వరగా విముక్తి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ఎంపీతో ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

Next Story