నెల్లూరు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

by  |
నెల్లూరు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, ఎంపీ డా. గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి వెంకయ్య నాయుడు ప్రత్యేక రైలులో వెంకటాచలం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడ నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కాన్వాయ్‌లో బయలుదేరి వెళ్లారు.

రైల్వే స్టేషన్‌లో ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, జిల్లా స్థాయి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇకపోతే శుక్రవారం నుంచి ఈనెల 14 వరకు నెల్లూరు జిల్లాలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉండనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌ తనిఖీలతోపాటు 453 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 10మంది సీఐలు, 46 మంది ఎస్ఐలు, 59మంది ఏఎస్ఐ, పీహెచ్‌సీలు, 308 మంది కానిస్టేబుళ్లు, 23 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొననున్నారు.


Next Story

Most Viewed