వామ్మో.. ఒక్క బండికి ఇన్ని చలన్లా ?

231
Chalans22

దిశ, వరంగల్ టౌన్: ప్రతి ఒక్కరూ పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ రామారావు అన్నారు. శనివారం 48 పెండింగ్ చలాన్లు ఉన్న వ్యక్తిని గుర్తించి పది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వరంగల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ లో ఓ బైక్ ను చెక్ చేయగా 48 పెండింగ్ చలాన్లు ఉన్నాయని గుర్తించామని, ఆ విషయమై వాహనదారుడిని ప్రశ్నించగా అన్ని చలాన్లు పడ్డ విషయం తను గమనించలేదని చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో వెంటనే ఆ వాహనదారుడు స్పందించి మీ సేవలో చెల్లించి క్లియర్ చేశారాన్నారు. ఆ వాహనదారుడిని వరంగల్ ట్రాఫిక్ సిఐ వడ్డే నరేష్ కుమార్ అభినందించారు. అతడిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ పెండింగ్ లో ఉన్న చలాన్లు కట్టి ట్రాఫిక్ పోలీసులకు సహకారించాలన్నారు.