పాలు లేకుండా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

by Disha Web Desk 8 |
పాలు లేకుండా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
X

పాలు లేకుండా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

దిశ,ఫీచర్స్ : పన్నీర్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక తందూరి రోటీ , పన్నీర్ కర్రీ కాంబినేషన్ అయిదే అదిరిపోద్ది. ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా చాలా మంది ఇది తప్పకుండా తింటారు. అయితే అసలు ఈ పన్నీర్ ఎలా తయారు చేస్తారంటే, పాలతోనే పన్నీరు తయారు చేస్తారని చాలా మందికి తెలుసు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాగా, పాలు లేకుండా పన్నీరు చేయవచ్చా? అంటే చేయోచ్చు అంటున్నారు కొందరు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పాలు లేకుండా పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.

1. వేరుశనగ

2. నిమ్మరసం లేదా వెనిగర్

తయారీ విధానం : ముందుగా పావు కేజీ వేరుశనగ పప్పు ను తీసుకొని ఆరు నుంచి ఏడు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి రుబ్బుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ.. రుబ్బుతూ ఉండాలి ఇలా చేయగా వేరుశనగ పాలు రెడీ అవుతాయి.

దీని తర్వాత గ్యాస్ ఆన్ చేసి వేరుశనగ పాలు కాస్త వేడి చేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రమైన కాటన్ క్లాత్‌లోకి తీసుకొని ఫిల్టర్ చేయాలి. తర్వాత నిమ్మరసం లేదా వెనిగర్ కొద్ది కొద్దిగా, పాలు విరిగి పోయేవరకు వేయాలి. తర్వాత కాటన్ క్లాత్ ద్వారా విరిగిన పాలను వడకడితే పన్నీర్ లాంటి పదార్థం వస్తుంది. దానినే ఫ్రిడ్జ్‌లో పెడితే పన్నీర్ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, పాలు లేకుండా ఈజీగా పన్నీర్‌ను తయారు చేసుకోండి.



Next Story

Most Viewed