కాత్యాయని దేవిగా వన దుర్గా మాత

345

దిశ,పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పంచమిని పురస్కరించుకొని అమ్మవారు కాత్యాయని మాత రూపం‌లో  దర్శనమిచ్చారు.  ఈ సందర్భంగా అమ్మవారిని పెసర రంగు వస్త్రాలతో అలంకరించి, వేకువజామునే గణపతి పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి‌తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

రుద్ర సహకార పూర్వక చండీ హోమం

సోమవారం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం గోకుల్ షెడ్ వద్ద రుద్ర సహకార పూర్వక చండీ హోమం నిర్వహించారు. ఈ హోమం‌లో ఏడుపాయల ఈవో సారా శ్రీనివాస్ తో పాటు ఆలయ ఉద్యోగులు వేద పండితులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..