అభిమానులే రాధాకు అండ: వల్లభనేని వంశీ

by srinivas |
vangaveeti Radha
X

దిశ, ఏపీ బ్యూరో : వంగవీటి రాధాకు అభిమానులు, కార్యకర్తలు అండగా ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అన్నారు. వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. అనంతరం ఇద్దరూ కలిసి వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. వంగవీటి మోహన రంగా అంతటి అత్యున్నత స్థాయికి రాధా రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు.. గుర్తుండే వ్యక్తులు ముగ్గురు అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పుకొచ్చారు. ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహన రంగాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తామెంతో గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వంగవీటి రంగా వంటి ఉన్నతస్థాయిలోకి వంగవీటి రాధా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రాధాకు అభిమానులు, కార్యకర్తలు అండగా ఉండాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed