యాదాద్రిలో కనుల పండువగా వైకుంఠ ఏకాదశి

135
Vaikuntha Ekadashi

దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. గుట్టపైన బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అంటారనే సంగతి తెలిసిందే. సాక్షాత్తు మహావిష్ణువు గారుడవహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారని భక్తుల విశ్వాసం. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. అందుకే ఈరోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే పాపవిముక్తులు అవుతారని అంతా భావిస్తుంటారు.