కేంద్రాన్ని ఆదేశించండి.. సుప్రీంలో బెంగాల్ ప్రభుత్వం పిటిషన్

by  |
కేంద్రాన్ని ఆదేశించండి.. సుప్రీంలో బెంగాల్ ప్రభుత్వం పిటిషన్
X

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన ఫేజ్ 3 వ్యాక్సినేషన్ పాలసీని నిలిపేయాలని, దేశవ్యాప్తంగా యూనిఫామ్‌గా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీకా ధరలపైనా నిర్ణయించిన విధానాన్ని రద్దు చేయాలని కోరింది. రాష్ట్రాలన్నింటికి టీకాలు ఉచితంగా అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాలు ప్రత్యేకంగా టీకా ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ ధరలపై బేరమాడే దుస్థితి నుంచి తప్పించాలని తెలిపింది.

ఇప్పటికే ఆరోగ్యరంగం సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు అదనంగా నిధులను కేటాయించాలని ప్రస్తుత విధానం నిర్దేశిస్తు్న్నదని వివరించింది. వ్యాక్సిన్ ప్రైసింగ్‌పై సుప్రీంకోర్టు గతవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాలసీని పున:సమీక్షించాలని సూచించింది. టీకా ఉత్పత్తిదారుల మధ్య పోటీతత్వం పెంచడానికి టీకా ధరలు వాటికే వదిలిపెడితే, పంపిణీ చేసే రాష్ట్రాలపై భారం పడక తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది.

వన్ నేషన్.. వన్ పార్టీ.. వన్ ప్రైస్ ఎందుకు వద్దు?: దీదీ

వన్ నేషన్, వన్ పార్టీ, వన్ లీడర్ అని బీజేపీ తరుచూ వాదనలు చేస్తుంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కానీ పేదల ప్రజల ప్రాణాలు రక్షించే విషయానికి వచ్చే సరికి టీకాలకు వన్ ప్రైస్ నిర్ణయించడానికి వెనుకడుగు వేస్తుందని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం, వయసులకు అతీతంగా ప్రతి భారతీయుడు ఉచితంగా టీకా పొందాలని సూచించారు. కేంద్రమైనా, రాష్ట్రమైనా.. ఎవరు చెల్లించడానికైనా టీకాలకు కేంద్ర ప్రభుత్వం ఒకే ధరను నిర్ణయించాలని తెలిపింది.



Next Story

Most Viewed