వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్.. ప్రభుత్వం ఉత్తర్వులు

by  |
వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్.. ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వ్యాక్సిన్​ వేయించుకునేందుకు వీలు కుదరని వారు పండుగ సెలవుల్లో వేసుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురుకానుంది. వ్యాక్సిన్​కోసం వారు నాలుగు రోజులు ఆగక తప్పడంలేదు. ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. బతుకమ్మ, దసరాతో పాటు శని, ఆదివారాలు రావడంతో నాలుగు రోజుల పాటు వ్యాక్సిన్ ప్రక్రియకు బ్రేక్​పడనుంది. ఈమేరకు తెలంగాణ సర్కార్​ఆదేశాలు జారీ చేసింది.


Next Story