టీకా కోవాగ్జిన్ సేఫే.. కానీ..

by  |
టీకా కోవాగ్జిన్ సేఫే.. కానీ..
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అంతం చేయడానికి భారత్ తయారుచేసిన స్వదేశీ వ్యాక్సిన్ కోవాగ్జిన్ సేఫేనని లాన్సెట్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ఇటీవలే ఫేస్-2 క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న సమయంలోనే జనవరి నుంచి దీనిని అత్యవసర వినియోగానికి అనుమతినివ్వడం తెలిసిందే.

కాగా ఫేస్-2 ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. టీకా సామర్థ్యంపై లాన్సెట్ స్పందిస్తూ.. కోవాగ్జిన్ సేఫేగానీ, దాని సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. ఫేస్-2 ఫలితాలు వచ్చినంత మాత్రానా దాని సామర్థ్యాన్ని అంచనా వేయలేమని పేర్కొంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను 12-18 ఏళ్లవారిపై, 55-65 ఏళ్ల వారిమీద మాత్రమే నిర్వహించారనీ.. కానీ ఇది చిన్న పిల్లలు, వృద్ధుల మీద ఎలా పనిచేస్తుందనేది తేలాల్సి ఉందని వివరించింది. ఇదిలాఉండగా భారత్ బయోటెక్ మాత్రం.. కోవాగ్జిన్ అన్ని విధాలా సేఫ్ అనీ, రోగ నిరోధకతను పెంపొందించుతుందని తెలపడం గమనార్హం.



Next Story

Most Viewed