ఓల్డ్ సిటీలో నో వ్యాక్సినేషన్..? ఆ సర్వేతో వెలుగులోకి షాకింగ్ నిజాలు

by Anukaran |
ఓల్డ్ సిటీలో నో వ్యాక్సినేషన్..? ఆ సర్వేతో వెలుగులోకి షాకింగ్ నిజాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో డిసెంబర్ చివరికల్లా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో వైద్య శాఖ టీకాల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించేందుకు ఎక్కడికక్కడ టీకా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. దాదాపు 90 శాతం ప్రజలకు మొదటి డోస్ ఇచ్చామని వైద్య శాఖ చెబుతోంది. అయితే, చాలా చోట్ల వ్యాక్సిన్‌పై అపోహలు ఉండటంతో వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ పాతబస్తీలోని మురికివాడల్లో పర్యటించి వ్యాక్సిన్‌పై అవగాహనతో పాటు సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఓల్డ్ సిటీలోని 20 బస్తీల్లో 55 శాతం మంది ప్రజలు ఇప్పటివరకు ఒక్క డోస్ కూడా వేయించుకోలేదని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో రాజేంద్రనగర్, హసన్ నగర్, జాలపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు 3వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 67 శాతం మంది సెకండ్ డోస్ తీసుకోలేదని తేలింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న పీహెచ్సీలతో మాట్లాడి మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్‌ల ద్వారా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని తెలిపారు.

Next Story