తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్.. ఎందుకో తెలుసా..!

by  |
తెలంగాణలో వ్యాక్సినేషన్ బంద్.. ఎందుకో తెలుసా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 70 శాతానికి పైగా రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా రెండవ డోస్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పండుగ సందర్భంగా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారు మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే, గురువారం నుంచి నాలుగు రోజులపాటు(అక్టోబర్ 14 నుంచి 17 వరకు) టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. దసరా పండుగతో పాటు శని, ఆదివారాలు రావటంతో నాలుగు రోజులు వ్యాక్సినేషన్​ ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.


Next Story

Most Viewed