రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు : ఉత్తమ్

by  |
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు : ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో గవర్నర్, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తామని ఉత్తమ్ వివరించారు. దళిత రైతుకు ఉన్న 13 గుంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న కారణంగానే ఆయన చనిపోయాడని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు-రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారన్నారు. రైతు మరణించాక ఎకరం భూమి ఇస్తున్నామని హరీష్‌రావు ప్రకటించడం దారుణమన్నారు.

13 శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం ఉండదని ఉత్తమ్ ధ్వజమెత్తారు ఒకటి రెండు జనాభా శాతం ఉన్న వారికి రెండు, మూడు మంత్రి పదవులు ఉన్నాయన్నారు. మహబూబ్ నగర్‌లో దళిత రైతును ఇసుక లారీతో తొక్కి చంపించడం కంటే దారుణం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యారంటే అంటే దళితులు-గిరిజనులే చలవే అనే విషయాన్ని మర్చిపోవద్దని ఉత్తమ్ గుర్తుచేశారు. తెలంగాణలో పోలీసులు నిజాయితీగా ఉన్నా… కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు.

Next Story

Most Viewed