తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యుత్ శాఖలో డ్రోన్ల వినియోగం

by  |
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. విద్యుత్ శాఖలో డ్రోన్ల వినియోగం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఆచరణలోకి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటున్నది. ఈ నేపథ్యంలో డ్రోన్ల వినియోగాన్ని పలు రంగాల్లో ఉపయోగించి అందరి చూపును ఆకర్షింసున్నది. కేవలం సినిమా షూటింగులు, పెళ్లిళ్ల వీడియోలు, పోలీసు తనిఖీలకు మాత్రమే ఉపయోగించే డ్రోన్లను అడవిలో సీడ్ బాల్స్‌ను చల్లేందుకు వినియోగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మెడికల్ ఎమర్జెన్సీలో మారుమూల పల్లెలకు ఔషదాలు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగించి సక్సెస్ అవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే, తాజాగా విద్యుత్ లైన్లు, టవర్లను తనిఖీ చేసేందుకు డ్రోన్లను వినియోగించేందుకు పైలెట్ ప్రాజెక్టు నిర్వహించింది. టీఎస్ ట్రాన్స్‌కో పరిధిలోని టవర్, హైటెన్షన్ విద్యుత్ తీగలను మానవరహితంగా తనిఖీ చేసేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా డ్రోన్లలో 4K రిజల్యూషన్ కెమెరాలు, కృత్రిమ మేధను వినియోగించి ట్రాన్స్‌మిషన్ టవర్లు, లైన్లు, సబ్‌స్టేషన్‌ల తనిఖీతో పాటు వాటి పర్యవేక్షణ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. 220 కేవీ చంద్రాయగుట్ట ఘనాపూర్ లైన్‌కు సంబంధించిన ఈహెచ్‌టీ ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్లు, 220 కేవీ శివరాంపల్లి-గచ్చిబౌలి లైన్, 132 కేవీ మిన్‌పూర్-జోగిపేట్ లైన్, 220 కేవీ బూడిదంపాడు-వడ్డెకొత్తపల్లి లైన్, మరో పది టవర్లను పరిశీలించారు. డ్రోన్లను వినియోగించేందుకు ముఖ్య కారణం.. కచ్చితమైన డేటా సేకరణతో పాటు తక్కువ ఖర్చుతో తనిఖీలు చేసేందుకు వీలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed