గుడ్‌న్యూస్.. డిఫెన్స్‌లో ఉద్యోగాలు.. ఆగస్టు 24న చివరి తేది

by  |
we are hiring
X

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన వారికి మరో సువర్ణ అవకాశం కల్పించింది యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్). 2021 సంవత్సరానికి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్ఈ రెండో విడత) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతి ఏడాది రెండు సార్లు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండగా.. ఇప్పటికే సీడీఎస్‌ఈ 1(ఒకటవ) దరఖాస్తులను యూపీఎస్సీ స్వీకరించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆగస్టు మొదటివారంలోనే రెండో నోటిఫికేషన్‌ ద్వారా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రస్తుతం డిఫెన్స్‌లోని మిలిటరీ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాల్లో 339 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. అత్యధికంగా చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో (169 పురుషులు, 16 మహిళల పోస్టులు), ఆ తర్వాత డెహ్రడూన్ ఇండియన్ మిలిటరీ అకాడమీలో (100 పోస్టులు), ఎజిమళ ఇండియన్ నేవల్ అకాడమీలో (22) పోస్టులతో పాటు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 32 ఖాళీలు ఉండటం విశేషం.

ముఖ్య గమనిక: ఆగస్టు 24న దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది అని యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌( https://upsc.gov.in/)లో స్పష్టం చేసింది.

దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. https://upsconline.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

ఫీజు.. విషయానికొస్తే జనరల్ క్యాటగిరి అభ్యర్థులు రూ. 200 చెల్లించి అప్లై చేసుకోవాలి. మరో శుభవార్త ఏంటంటే.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

పరీక్ష తేది: అభ్యర్థులు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల్లో నవంబర్‌ 14, 2021న నిర్వహిస్తారు.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. వీటితో పాటు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 24కు మించరాదు.. 20 నుంచి 24 ఏళ్ల యువకులై ఉండాలి.

పరీక్షా కేంద్రాలు: దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నవంబర్ 14, 2021 నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

అభ్యర్థులు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి (https://upsc.gov.in/) సంప్రదించగలరు. అర్హత ఉన్నవారు ఇప్పుడే ధరఖాస్తు చేసుకోవడానికి https://upsconline.nic.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


Next Story

Most Viewed