'ఉప్పెన' సింగిల్ వేవ్ … మ్యూజిక్ మ్యాజిక్

by  |
ఉప్పెన సింగిల్ వేవ్ … మ్యూజిక్ మ్యాజిక్
X

‘ఉప్పెన’.. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం. ఇద్దరికీ ఈ సినిమా తొలి చిత్రం కాగా.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ వేవ్ అద్భుతంగా ఉంది. ఉప్పెన నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. నీ కన్ను నీలి సముద్రం .. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం సాంగ్‌తో రాకింగ్ ఫస్ట్ వేవ్ ఇచ్చాడు దేవి. శ్రీమణి ఫెంటాస్టిక్ లిరిక్స్ అందించగా…. రాకింగ్ స్టార్ అంతకు మించిన ఎఫర్ట్స్‌తో లవెబుల్ మెలోడి మ్యూజిక్ అందించాడు. ఈ మధ్య వచ్చిన ఆల్బమ్స్‌లో దేవికి ఇది బెస్ట్ కాగా … సాంగ్‌ ఫస్ట్‌లో వచ్చే కవ్వాలి మ్యూజిక్ వావ్ అనిపించేలా ఉంది. ఇక సాంగ్‌లో హీరోయిన్ లుక్స్.. రచయిత ఊహకలకు మించి ఉండగా…. హీరో వైష్ణవ్ తేజ్ లుక్స్ భేష్‌గా ఉన్నాయి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ‘ఉప్పెన’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Tags : Uppena, Panja Vaishnav Tej, Krithi Shetty, Vijay Sethupathi

Next Story

Most Viewed