లాక్‌డౌన్‌లో ఉప్పల ఫౌండేషన్ సేవలు

by  |
లాక్‌డౌన్‌లో ఉప్పల ఫౌండేషన్ సేవలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.50 లక్షల మందికి భోజనాలు, 14వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ తెలంగాణ, ఏపీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఎంపీ సంతోష్‌కుమార్‌ను కలిసి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను వివరించారు. వైద్యులకు, జర్నలిస్టులకు, పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశామన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకొని ప్రశంసించినట్లు చెప్పారు. అలాగే 33జిల్లాల ఐవీఎఫ్ కమిటీలు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీకి ఏక బిల్వం మొక్కను అందజేశారు. అలాగే ప్రముఖ చిత్రకారుడు వెంకట్ కందునూరి చేతిలో రూపుదిద్దుకున్న రెండు భారీ చిత్రపటాలను సంతోష్‌కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ నాయకులు సాయికిరణ్, సాయితేజ పాల్గొన్నారు.

Next Story