ఉపాధి కూలీ మృతి

by  |
ఉపాధి కూలీ మృతి
X

దిశ, మహబూబ్‌నగర్: ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనులకు వెళ్లి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని సింగందొడ్డి గ్రామానికి చెందిన కొమ్ము చిన్నరాములు(55) శుక్రవారం మృతిచెందారు. స్థానిక కూలీల వివరాల ప్రకారం.. రోజులాగే ఇవాళ కూడా ఉదయం ఉపాధి పనులకు వెళ్లిన రాములు పనులు చేస్తూ ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. గమనించిన కూలీలు అతని వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. దీంతో మృతదేహం వద్ద ఆయన భార్య రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

Next Story

Most Viewed