ముచ్చింతల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

67

దిశ శంషాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ చిన్న జీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరి లో జరగబోయే శ్రీ రామానుజాచార్యుల శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు విచ్చేయనున్నారు. ప్రధాని చేతులు మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనున్నట్టు సమాచారం.