ఏపీలో ఐదు బీచ్‌లను అభివృద్ధి చేస్తాం.. కేంద్రమంత్రి ప్రకటన

by srinivas |
MP Adala
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో బీచ్‌ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే స్పష్టం చేశారు. రుషికొండ బీచ్‌తోపాటు రాష్ట్రంలో 5 బీచ్‌లను గుర్తించామని వాటిని పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీచ్‌ల అభివృద్ధిపై సోమవారం లోక్‌సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాగే బీచ్‌ల అభివృద్ధికి ఏ మేరకు నిధులు కేటాయించారని.. పనుల్లో పురోగతి ఎంతవరకు వచ్చిందని కూడా అడిగారు.

దీనికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రుషికొండ బీచ్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు బీచ్‌లను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. బీచ్‌లను గుర్తించే ముందు అక్కడి నీటి నాణ్యత, పర్యావరణ పరీక్షలు నిర్వహించేందుకు ఒక అంచనా సర్వే నిర్వహించినట్లు స్పష్టం చేశారు. రుషికొండ బీచ్‌లో నాణ్యతా ప్రమాణాలు, పర్యావరణ పరిస్థితులు చక్కగా ఉండటంతో దీనికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే తెలియజేశారు.

Next Story

Most Viewed