జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

29
budget

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సెషన్ మొత్తం రెండు విడతలుగా జరగనుంది. తొలి విడత సమావేశాలు ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 11 వరకు సాగనున్నాయి. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మార్చి 14నుంచి రెండో విడత సెషన్ ప్రారంభమై, ఏప్రిల్ 8న ముగియనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు జనరల్ సెక్రటరీ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ఈ సమావేశాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నారు. ఇటీవల 400 మందికిపైగా పార్లమెంటు సిబ్బందికి పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలతోపాటు పార్లమెంటు కంప్లెక్స్‌లోకి ప్రవేశించేవారందరూ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌తోపాటు రెండు డోసుల వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తున్నది.