ఈ నెల 12న మరో మిలియన్ మార్చ్.. ట్యాంక్ బండ్ మరోసారి రణరంగం కానుందా?

by  |
Millon-March-1
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ గురించి మనకందరికీ గుర్తుంటది. ఎందుకంటే మిలయన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. పోలీసులు, ఉద్యమకారుల మధ్య వాగ్వాదం ఎంతవరకు వెళ్లిందో తెలిసిందే. పోలీస్ రబ్బరు బుల్లెట్లు, విరిగిన లాఠీలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉద్యమకారులు మిలయన్ మార్చ్ ను ఏ విధంగా విజయవంతం చేశారో మనకు తెలిసిందే.

ఈ విషయం ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఓ ప్రకటన చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల విషయమై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా ఫైరయ్యారు. కేసీఆర్ బెదిరింపులు, అధికార దుర్వినియోగం, పంచిన డబ్బులు హుజురాబాద్ లో ఏం పనికిరాలే.. అక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు చనిపోతున్నా పట్టించుకోవడంలేదన్నారు.

అదేవిధంగా ఈనెల 12న నిరుద్యోగ మిలయన్ మార్చ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రాజకీయ నేతలు, విశ్లేషకులు ఈ విధంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలపై నిత్యం నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో ప్రజల్లో బీజేపీపై క్రమక్రమంగా నమ్మకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిరుద్యోగ మిలయన్ మార్చ్ నిర్వహిస్తోంది. అప్పటి మిలయన్ మార్చ్ ఇప్పటికీ గుర్తుంది.. మరి ఈ విధంగా దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ ఆధ్వర్యంలో మరో మిలయన్ మార్చ్ అంటే ఎలా ఉంటుందో అని, అదేవిధంగా నిరుద్యోగులు సర్కారుపై కోపంగా ఉన్నందున వాళ్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం లేకపోలేదు.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా పోలీసులచే ప్రభుత్వం వారిని అడ్డుకుంటోందని, మరి ఇక్కడ కూడా మిలియన్ మార్చ్ ను పోలీసులు అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉంటదో.. ట్యాంక్ బండ్ మరోసారి రణరంగంగా మారుతదా ఏందీ..? అని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన 9 బీజేపీ పాలిత రాష్ఠ్రాలు..భారీగా తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ ప్రభుత్వం రేట్లను తగ్గించనుందా.?

Next Story

Most Viewed