మందు బాబులకు అడ్డాగా గోదావరి పుష్కరఘాట్‌‌

by  |
మందు బాబులకు అడ్డాగా గోదావరి పుష్కరఘాట్‌‌
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన ఉన్న పుష్కర‌ఘాట్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నది మురికిమయంగా మారింది. స్నానానికి వచ్చే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు హడావిడి చేసే అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత పాటించాల్సిన మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది అటువైపు దృష్టి సారించడం లేదు. వచ్చేది శ్రావణ మాసం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు శానిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

మందుబాబులకు అడ్డాగా..

కాలేజీ రోడ్ నుంచి గోదావరి వరకు మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం కాగానే పలువురు ఆకతాయిలు గోదావరి తీరంలో కూర్చొని మందు కొడుతున్నారు. ఖాళీ బాటిల్స్, గ్లాసులను గోదావరి నదిలోకి విసిరేస్తున్నారు. ఈ చేష్టలతో నది మొత్తం మందు బాటిళ్లు, మందు గ్లాసులతో దర్శనం ఇవ్వడం భక్తులకు మరింత ఇబ్బందిగా మారింది.



Next Story

Most Viewed