ఓయూలో అనధికార వ్యక్తులు

by  |
ఓయూలో అనధికార వ్యక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలో శాంతి భద్రత సమస్య ఉందని.. విద్యార్థుల ముసుగులో కొంతమంది హాస్టల్ గదుల్లో ఉంటున్నారని యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో వర్సిటీలోని అన్ని హాస్టళ్లను మూసివేశామని గుర్తు చేసిన ఆయన.. హాస్టల్‌లో అక్రమంగా బస చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అనధికారికంగా ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలని ఆయన లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ పీఆర్‌వో హెచ్చరించారు.

Next Story

Most Viewed