విమానాశ్రయంలో యూఎల్డీ కూల్ డాలీ

by  |
విమానాశ్రయంలో యూఎల్డీ కూల్ డాలీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: జీఎంఆర్ విమానాశ్రయంలో ఔషధాలు, పెరిషబుల్స్ లాంటి టైం, టెంపరేచర్ సెన్సిటివ్ సరుకు రవాణాలో అవరోధం కలగకుండా కోల్డ్ చెయిన్ కోసం ప్రత్యేకమైన మల్టీ యూనిట్ లోడ్ డివైజ్ కూల్ డాలీని ఆవిష్కరించారు. ఈ మల్టీ యూఎల్డీ కూల్ డాలీని జీఎంఆర్ గ్రూపు ‘రిపోజింగ్ ద ఫెయిత్ ఇన్ ఫ్లయింగ్’ అన్న వెబినార్ సిరీస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ‘ఎయిర్ కార్గో – ఛేంజింగ్ డైమెన్షన్స్’ అన్న మూడో వెబినార్‌లో పౌర విమాన యాన శాఖ సీనియర్ ఎకనామిక్ అడ్వైజర్ వందనా అగర్వాల్ మంగళవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ప్యానెల్‌లోని మిగతా స్పీకర్లు జీహెచ్ ఈఏఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్, బ్లూడార్గ్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తులసీ మిర్‌చందానీ, ఏఏఐసీఎల్ ఏఎస్ జీఈఓ కేకు గజ్దార్, సీసీఈ అజిలిటీ లాజిస్టిక్స్ సీఈఓ సతీష్ లక్కరాజు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో ఇప్పుడు క్లిష్టమైన టెంపరేచర్- సెన్సిటివ్ పదార్థాల రవాణాను ఒక నియంత్రిత వాతావరణంలో నిర్వహించనుంది. ఒక స్టీల్ ట్రెయిలర్, అల్యూమినియం ఇన్సులేటెడ్ కంటెయినర్ కలిగిన ఈ కూల్ డాలీ ఎయిర్ కార్గో టెర్మినల్ మొబైల్ స్టోరేజీ యూనిట్‌గా ఉపయోగపడుతుంది. కూల్ డాలీ ఒక ట్రిప్‌లో 7 టన్నుల కార్గోను హ్యాండిల్ చేయగలదు. ఈ సందర్భంగా జీహెచ్ ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. ‘‘మేం నిరంతరం మా కస్టమర్లకు వినూత్నమైన, సుస్థిరమైన కార్గో నిర్వహణా సొల్యూషన్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రాణాలను కాపాడే ఔషధాలు, టెంపరేచర్ సెన్సిటివ్ పదార్థాల రవాణాలో అన్-బ్రోకెన్ కోల్డ్ చెయిన్ కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూల్ డాలీ అనేది ఒక విలువైన వాల్యూ అడిషన్‌గా ఉపయోగపడుతుంది. మా కార్గోలో 70శాతానికి పైగా ఔషధాలు ఉన్న నేపథ్యంలో అత్యవసర కార్గో అయిన ఔషధాలు, వ్యాక్సిన్లు, పండ్లు, కూరగాయలు ఇతర పాడైపోయే అవకాశమున్న పదార్థాలను సురక్షితంగా రవాణా చేసే కూల్ డాలీ మా ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరచింది’’ అన్నారు.



Next Story

Most Viewed