రెండోసారి క్వారంటైన్‌కు యూకే ప్రధాని

by  |
రెండోసారి క్వారంటైన్‌కు యూకే ప్రధాని
X

లండన్: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండోసారి క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా వైరస్ బారిన పడే ముప్పు ఉన్నందున ఎన్‌హెచ్ఎస్ టెస్ట్, ట్రేస్ బృందాల సూచనల మేరకు ముందుజాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాన్సన్ తెలిపారు. కొవిడ్ 19 పాజిటివ్ ఉన్నవారితో తాను కాంటాక్ట్‌లో ఉన్నారని, కాబట్టి కచ్చితంగా స్వీయ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని నేషనల్ హెల్త్ సర్వీస్ టీం తెలిపినట్టు ఆయన ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాల్లేవని, కానీ నిబంధనలు పాటిస్తున్నట్టు తెలిపారు.

కరోనా కట్టడి చర్యల కోసం క్వారంటైన్ నుంచే సర్కారుకు మార్గదర్శకత్వం వహించనున్నట్టు వివరించారు. లీ అండర్సన్ సహా పలువురు కన్జర్వేటివ్ నేతలతో బోరిస్ జాన్సన్ గురువారం కలిశారు. తర్వాత లీ ఆండర్సన్‌కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆ సమావేశంలో పాల్గొన్న బోరిస్ జాన్సన్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఎన్‌హెచ్ఎస్ సూచించింది. ఈ ఏడాది తొలినాళ్లలో కరోనా పాజిటివ్ తేలడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్‌లోని ఓ హాస్పిటల్‌ ఐసీయూలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

Next Story