రైలు ఇంజన్ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

by  |
రైలు ఇంజన్ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకెళ్లిన ఇద్దరు మహిళలు రైలు ఇంజన్ ఢీ కొని మృతి చెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ మండలం గౌతవరం గ్రామానికి చెందిన కొంగరపు పున్నమ్మ, పసుపులేటి లక్ష్మీ టిఫిన్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా పుల్లేటి కాలువపై రైల్వే బ్రిడ్జి మీదుగా వస్తుండగా వెనుక నుంచి వస్తున్న రైలు ఇంజన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed