షాట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాద్ నుంచి కెమెరామెన్‌ను పిలిపించి..

by  |
fraud
X

దిశ, ఏపీ బ్యూరో: బెజవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. షాట్ ఫిల్మ్ తీయాలని హైదరాబాద్ నుండి కెమెరాలు కావాలని కొందరు కేటుగాళ్లు కెమెరామెన్ కేతవత్‌ను కోరారు. అది నిజమని నమ్మిన హైదరాబాదు కమలాపురి కాలనీకి చెందిన కెమెరామెన్ కేతవత్ కెమెరాలతో విజయవాడ వచ్చాడు. అనంతరం తనను ఫోన్‌లో సంప్రదించిన వాళ్లకు ఫోన్ చేశాడు. దీంతో ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్‌ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని ఓ హోటల్ తీసుకు వెళ్ళారు. కెమెరామెన్‌ను భోజనానికి పంపి హోటల్ నుండి 20 లక్షల కెమెరాలతో ఉడాయించారు.

భోజనం చేసిన తర్వాత రూమ్‌కు వచ్చి చూడగా కెమెరాలు కనిపించలేదు. తనను సంప్రదించిన వాళ్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించాడు. దీంతో విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు బాధితుడు కేతవత్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌లోని సీసీఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా జరిగినట్లు బాధితులు వాపోయారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితుడు కేతవత్ కోరుతున్నాడు.

Next Story

Most Viewed