యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా

by  |
యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా
X

దిశ,వెబ్‌డెస్క్: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. యూకే నుంచి వచ్చిన వారిలో మొత్తం 18 మందికి కరోనా నిర్దారణ అయింది. కాగా 18 మంది ప్రైమరీ కాంటాక్టుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. యూకే నుంచి వచ్చిన కరోనా బాధితుల్లో నలుగురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. యూకే నుంచి జగిత్యాల జిల్లాకు వచ్చిన వారిలో ఇద్దరికి, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి. యూకే నుంచి వచ్చిన వారిలో 92 మందిని ఇతర రాష్ట్రాల వారిగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చి స్వరాష్ట్రాలకు వెళ్లిన వారిని ప్రభుత్వం గుర్తించింది. యూకే ప్రయాణీకుల గురించి ఆయా రాష్ట్రాలకు ప్రభుత్వం సమాచారం అందించింది. యూకే నుంచి వచ్చిన వారిలో 184 మంది సమాచారం లేదని వెల్లడించింది.

Next Story