ఇండియన్ బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్..

by  |
beach
X

దిశ, ఫీచర్స్ : హాలీడే స్పాట్స్ అనగానే టక్కున గుర్తొచ్చేవి సముద్ర తీరాలే. ఇండియాలోని చాలా నగరాలు బీచ్‌లకు ప్రసిద్ధి కాగా.. ఎక్కువ సంఖ్యలో బీచ్‌లు ఉన్నది మాత్రం గోవాలోనే. ఈ పర్యాటక నగరంలోని పాపులర్ బీచ్‌ల్లో విదేశీయులు సైతం సందడి చేస్తుంటారు. అయితే సందర్శకుల తాకిడితో బీచ్‌ల్లో ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతుందని స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ రహితంగా ఉంటూ స్వచ్ఛతను పాటించే ఇండియన్ సముద్ర తీరాలకు ‘బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్’ ఇస్తుండగా.. తాజాగా తమిళనాడులోని కోవాలం, పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్‌లు ఇందుకు ఎంపికయ్యాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించగా.. భారత్‌లో ఈ సర్టిఫికెట్ పొందిన బీచ్‌ల సంఖ్య 10కి చేరింది.

‘బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్’ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ ట్యాగ్. ఇది నాలుగు ప్రధాన విభాగాలు – పర్యావరణ విద్య & సమాచారం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ & పరిరక్షణతో పాటు బీచ్‌లలో భద్రత, సేవలకు సంబంధించిన 33 కఠిన ప్రమాణాల ఆధారంగా మంజూరు చేయబడుతుంది. ఈ సర్టిఫికేషన్‌ను అందించే ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (FEE).. గుజరాత్‌లోని శివరాజ్‌పూర్, దియూలోని ఘోగ్లా, కర్ణాటకలోని కాసర్‌కోడ్ & పాదుబిద్రి, కేరళలోని కప్పడ్, ఆంధ్రప్రదేశ్‌లోని రుషికొండ, ఒడిశాలోని గోల్డెన్‌‌తో పాటు అండమాన్ నికోబార్‌లోని రాధానగర్ వంటి ఎనిమిది బీచ్‌లను రీసర్టిఫై చేసింది. వీటికి 2020 అక్టోబర్‌లోనే ‘బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్’ లభించింది.

బ్లూ-ఫ్లాగ్ సర్టిఫికేషన్..
బ్లూ ఫ్లాగ్ పొందిన బీచ్‌లు ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైనవిగా పరిగణించబడతాయి. పర్యాటకులకు/సముద్రతీరాలకు.. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన స్నానపు నీరు, సౌకర్యాలు, సురక్షితమైన & ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు ఈ ప్రాంత స్థిరాభివృద్ధికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగడుతుంది.

Next Story