నల్లెళ్లలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

by  |
నల్లెళ్లలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
X

దిశ, వరంగల్: ఉమ్మడి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. సరదా కోసం వెళితే ప్రాణమే పోయింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెళ్ల గ్రామానికి చెందిన షేక్ చాంద్-ఫరిదా దంపతుల కుమారుడు ఎక్బాల్ పాషా (18), బయ్యారం మండలం ఉప్పలపాడుకు చెందిన కైరత్ అలీ-జైన దంపతుల కుమారుడు యాకూబ్ పాషా (16) వరుసకు బావబామ్మర్దులు. అయితే వీరిద్దరూ బుధవారం వాటర్ క్యాన్ల సాయంతో ఈత నేర్చుకునేందుకు బావి వద్దకు వెళ్లారు. బావిలో దిగి ఈత కొట్టే క్రమంలో క్యాన్ ఊడిపోయి నీటిలో మునిగి చనిపోయారు. చీకటి పడుతున్నా వారు కనపడకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సాయంతో పరిసరాల్లో వెతికారు. బావి సమీపంలో పిల్లల చెప్పులు కనిపించాయి. దీంతో బావిలో చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం మార్చూరీకి తరలించారు.

ఇదిలా ఉండగా నల్లెళ్ళ గ్రామంలో అర్థరాత్రి మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాంపల్లి ముత్తమ్మ (60) అనే మహిళ కుటుంబ కలహాలతో అర్దరాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed