బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ.. 25 మంది మృతి

77

ఢాకా: బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది.  పద్మానదిలో రెండు పడవలు ఢీకొని 25మంది మృతిచెందారు. సోమవారం బంగ్లాదేశ్ లోని షిబ్‌చర్ పట్టణ సమీపంలోని పద్మానదిలో 30 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవను, ఎదురుగా వస్తున్న ఇసుక పడవ ఒకటి ఢీ కొట్టింది. దీంతో పడవల ఉన్న 30 మంది నీటిలో మునిగిపోయారు. వీరిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా, 25 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. పడవల నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..