ట్విట్టర్ న్యూ ప్రైవసీ రూల్స్.. ఏంటో తెలుసా?

by  |
twitter news
X

దిశ, డైనమిక్ బ్యూరో : సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇతర యూజర్ల ఫొటోలను, వీడియోలను షేర్ చేసే వీలు ఉండేది. దీంతో ఒకరి ఫొటోలను సేవ్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం, భయబ్రాంతులకు గురిచేయడాన్ని తెలుసుకున్న ట్విట్టర్ ఇకపై అలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది. ఇకపై వేరొకరి ఫొటోలను షేర్ చేయాలంటే వారి నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రకటించింది. వ్యక్తిగత వివరాలను షేర్ చేయడం వల్ల వారి గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నట్లు ట్విట్టర్ పేర్కొంది.


Next Story

Most Viewed