హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ట్విస్ట్.. ఫుల్ హ్యాపీగా లోకల్ లీడర్లు

by  |
Revanth-Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ప్రచారం జరుగుతుంటే, నేతలు మాత్రం వెరైటీ డెసిషన్ తీసుకున్నారు. పోటీ చేసినా పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతుంటే, డీసీసీ మాత్రం డబ్బు చెల్లించి మరీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బై పోల్స్ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సరికొత్త ఆలోచనకు తెర లేపింది.

ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న నాయకులు రూ. 5 వేలు టీపీసీసీ పేబుల్ ఎట్ హైదరాబాద్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలని స్పష్టం చేస్తోంది. ఆశావాహులు బయోడేటా, పాస్ పోర్టు సైజ్ ఫోటోను జత చేసిన దరఖాస్తు ఫారాన్ని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 5వ తేదీలోగా అందించాలని కోరింది. ఆశావాహులు అందజేసిన దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పంపిస్తామని డీసీసీ సభ్యులు వివరిస్తున్నారు. తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థిని ఫైనల్ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

నిన్నటి వరకు..

నిన్న మొన్నటి వరకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడేమో దరఖాస్తు చేసుకోవాలని, రూ.5 వేల డీడీ కూడా కోరడం గమనార్హం. ఇప్పటికే ముగ్గురు ఆశావాహుల పేర్లను ఢిల్లీకి పంపించారని ఆభ్యర్థిగా ఆ జాబితాలో ఉన్న వారినే ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను పీసీసీ ఇచ్చేసింది. చివరకు అభ్యర్థిని ప్రకటించేందుకు పీసీసీతో పాటు హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు కూడా పలు మార్లు సమావేశం అయ్యారు. 10వ తేది వరకు అభ్యర్థి పేరును ప్రకటిస్తామని కూడా స్పష్టం చేశారు. తీరా బుధవారం దరఖాస్తులు చేసుకోవాలని డీసీసీ కోరడం విచిత్రం.

ఇద్దరి దరఖాస్తు..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ ఇద్దరు నాయకులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కమలాకర్ రెడ్డి, లింగారెడ్డిలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ డీసీసీ ఫార్మాట్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారు.



Next Story

Most Viewed