చిల్లర మరిచామంటూ సజ్జనార్‌కు ట్వీట్లు.. అదే పరిష్కారం అంటున్న నెటిజన్లు!

by  |
Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రోజుకో నిర్ణయం తీసుకుంటూ ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు ట్విట్టర్ వేదికగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అందులో కొన్నింటిని అమలు కూడా చేశారు. దీంతో ప్రజలకు ప్రజారవాణాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ నేపథ్యంలో శనివారం ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. నెటిజన్ ట్వీట్ ప్రకారం “టికెట్ వెనుక రాసిన రూ.80 తీసుకోకుండా బస్సు దిగానని, నా డబ్బు నాకిప్పించాలని కోరుతూ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించిన సజ్జనార్.. డిపో మేనేజర్‌ను పరిశీలించాలని కోరారు. వెంటనే ఫోన్ పే ద్వారా రూ.80 ను చెల్లించారు. అదేవిధంగా ఆదివారం కూడా మరో నెటిజన్ రూ.85 మరిచిపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేశారు.

అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా గమ్యస్థానంలో దిగే తొందరలో డబ్బు తీసుకోవడం మరిచిపోతే ట్వీట్‌తో తిరిగి చెల్లించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా టికెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వాలని ప్రతి బస్సులో ఉన్నా.. ప్రయాణికులెందుకు పాటించరో తెలియదని, టికెట్ రూ.15 అవుతే, రూ.100 ఇవ్వడం సరికాదంటు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా, టికెట్ పై బ్యాలెన్స్ అమౌంట్ రాయడంతో మర్చిపోయి ట్వీట్ చేయడం కంటే ముందే గుర్తుంచుకొని డబ్బులు తీసుకోండంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed