TUTF జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి..

by  |
TUTF జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి..
X

దిశ, బోథ్: ఈనెల 28న జిల్లా కేంద్రంలోని విద్యార్థి జూనియర్, డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న TUTF ఆదిలాబాద్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని TUTF బోథ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరి సతీష్ కుమార్, అప్పాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బోథ్ మండలంలోని TUTF సంఘ ప్రాథమిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.



Next Story