ఈ రాశి స్త్రీలకు నేడు మరిచిపోలేని తీపి గుర్తు

723
Panchangam Rasi phalalu

తేది : 28, సెప్టెంబర్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న సాయంత్రం 3 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న సాయంత్రం 5 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 42 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 48 ని॥ వరకు)
అమృతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 36 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 17 ని॥ వరకు)
(ఈరోజు ఉదయం 10 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 5 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 7 ని॥ లకు
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృషభము

మేష రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ భార్య భర్తలు కుటుంబ వ్యవహారాల మీద గొడవలు పడతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే మరింత కష్టపడాలి. ఆదాయ వ్యవహారాల్లో పెద్దవారి సహాయం లభిస్తుంది. దుబారా ఖర్చులను నివారించండి లేకుంటే డబ్బుకు ఇబ్బంది పడతారు. ఈ రాశి స్త్రీలు.. మీ భార్య భర్తలు చిన్న విషయాలను పెద్దవిగా చేసి గొడవలు పెంచుకోకండి

వృషభ రాశి: సహనం, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి చూపిస్తారు. మానసిక ఆరోగ్యం కొరకు మెడిటేషన్ చేయండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగులు, పై అధికారుల ప్రశంసలు కురిపిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

మిధున రాశి : దైవప్రార్థన వలన మానసిక బలం. పాతకాలపు చింతకాయ పచ్చడి ఆలోచనలను వదిలిపెట్టండి. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొంతమంది ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కర్కాటక రాశి : వ్యాపారస్తులు ఆదాయ వ్యవహారాలపై జాగ్రత్త వహించండి. విదేశీ వ్యాపారం లాభం. కుటుంబ సభ్యులకు ఒక సమయం కేటాయించండి. ముఖ్యంగా పెద్ద వారితో మాట్లాడటం మీకెంతో ఎనర్జీ. అతిగా తినడం వల్ల ఊబకాయం. టీవీ మొబైల్ లతో ఎక్కువ గడపటం వలన సమయం వృథా. కావలసినంత ధనం చేతికందుతుంది. అవసరాలకు ఖర్చు పెడతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను వస్తాయి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి. ముఖ్యంగా మీ భార్యతో మనసు విప్పి మాట్లాడండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. సామాజిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. విదేశాలతో వ్యాపారం చేసే వారు జాగ్రత్త వహించండి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్యారాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. కావలసిన ధనం చేతికందుతుంది. అవసరాలకు ఖర్చు పెడతారు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు. నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. కొంతమంది ఉద్యోగం మార్పుకు ప్రయత్నాలు చేస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

తులారాశి : ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. దానివలన మనశ్శాంతి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. అప్పు ఇచ్చే ముందు వారి స్థితిగతులను గురించి పూర్తిగా తెలుసుకోండి. కొంతమంది ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. ముఖ్యంగా పిల్లలతో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది

ధనుస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి తేడా గమనించండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. కావలసిన ధనం చేతికందుతుంది. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. ఫిట్ నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలను మర్చిపోండి. మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజున గడపండి.

కుంభరాశి : జరిగిపోయిన విషయాలను తలచుకోవడం వలన మానసిక అశాంతి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. పెద్ద వారి సలహాలు తీసుకోండి. కావలసినంత ధనం చేతికందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. తోటి ఉద్యోగులతో సామరస్య ధోరణి వల్ల ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు

మకర రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసము ధైర్యము పట్టుదల అవసరం. జరిగిపోయిన విషయాలను తలుచుకుని బాధ పడకండి. దాని వలన సమయం వృథా కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసు పనుల్లో అదనపు వలన అధిక శ్రమ. ప్రయాణాలలో డబ్బు వస్తువులు జాగ్రత్త. బయటి తిండి తినడం వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ రోజు మీ పనులను ఎంజాయ్ చేస్తారు. కావలిసినంత ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.