బ్రేకింగ్ : శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. TDD కీలక నిర్ణయం

by  |
బ్రేకింగ్ : శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. TDD కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న కురిసిన వర్షాలకు గాను తిరుపతి వెళ్లే మార్గంలోని ఘాట్ రోడ్డు చాలా మేర ధ్వంసమైంది. పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు విరిగిపడటంతో బాలపల్లి- తిరుమల అన్నమయ్య ఘాట్ రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ ఘాట్ రోడ్డును మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. అక్కడే మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేసింది. అంతేకాకుండా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. జనవరి 13న వైకుంఠ మార్గం ద్వారా దర్శనాలు ప్రారంభించాలని చూస్తున్నది.

10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా అన్నమయ్య ప్రాజెక్టు వద్ద కొట్టుకుపోయిన ఆలయాల పున:నిర్మాణం చేపడతామని ప్రకటించింది. ఐటీ విభాగాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావించినట్టు కూడా తెలుస్తోంది. రూ.2.6 కోట్లతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేయనున్నట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది. కాగా, శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులను టీటీడీ బోర్డు ఇప్పటికే ప్రారంభించింది.



Next Story

Most Viewed