ఆర్టీసీ బస్సులో అలా చేస్తే జైలుకే.. సజ్జనార్ హెచ్చరిక

by  |
TS RTC MD Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో: డైనమిక్ IPS ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీని క్రమశిక్షణలో పెట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో నెటిజన్ల రిక్వెస్ట్‌తో బస్సులపై బూతు బొమ్మల పోస్టర్ల ప్రకటనలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజాగా ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులను క్రమశిక్షణలో పెట్టేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బస్సులో గుట్కాలు, పాన్‌లు తినడం, ఉమ్మివేయడం కానీ నిషేదమని ప్రకటించారు. దీనిని అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది కేవలం ప్రయాణికులకే కాదని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా అమలవుతుందని పేర్కొన్నారు. అయితే, దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలను ఆర్టీసీ ఆర్ఎం, డీవీఎం, డీఎంలకు ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

ఆర్టీసీకి సీజేఐ ఎన్వీ రమణ లేఖ.. స్పందించిన సజ్జనార్ ఏం చేశారంటే.?

Read:రైతులకు అండగా సజ్జనార్.. ఇక వారికి తిప్పలు తప్పినట్లే!

Next Story

Most Viewed