ఏపీ జ‌ల‌ దోపిడీని అడ్డుకుంటాం : పువ్వాడ

by  |
ఏపీ జ‌ల‌ దోపిడీని అడ్డుకుంటాం : పువ్వాడ
X

దిశ‌, ఖ‌మ్మం : ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న జ‌ల‌ దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శ్రీ శైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేసి పోతిరెడ్డిపాడు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదన్నారు. బుధవారం ఖమ్మం వీడీవోస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం మంత్రి మాట్లాడుతూ..ఏపీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లెలా చేపడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన న్యాయం పోరాటాం చేస్తమన్నారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన పెద్ద తప్పిదంగా వర్ణించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3టీఎంసీల నీటిని లిఫ్టు చేసేలా కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడం సరికాదన్నారు. వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని మంత్రి అజయ్ డిమాండ్ చేశారు. కృష్ణా నీటిని ఏపీ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని మీడియాకు వివరించారు. రాష్ట్రానికి ఇంకా నీటి అవసరం ఉందని, మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాల్సి ఉంటుందన్నారు.సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు త‌దిత‌రులు ఉన్నారు.

Next Story